SBI Recruitment: ఎస్‌బీఐ లో 13,735 క్లర్క్ పోస్టులు! 5 d ago
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) లో 13,735 క్లరికల్ కేడర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 50 ఖాళీలు ఉండగా, తెలంగాణలో 342 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధుల వయసు 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. విద్యార్హత ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 7. జనరల్/ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ. 750/- ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ పిడబ్ల్యూబిడీ అభ్యర్ధులకి ఫీజు లేదు. అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ ఆన్‌లైన్ టెస్ట్( ప్రిలిమినరీ, మెయిన్స్ ఎగ్జామ్), స్ధానిక భాష పరీక్ష ద్వారా జరుగుతుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.